తెలంగాణ
pension : కొత్త పింఛన్ అర్హులకు శుభవార్త.. రేపటి నుంచే దరఖాస్తులు!
కొత్తగా పింఛన్ కోసం ఎదురుచూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 'చేయూత'పథకం కింద కొత్త పింఛన్ల మంజూరుకు కసరత్తు ప్రారంభించింది. వీలైనంత తొందరగా అర్హులకు కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నారు. ఇందుకోసం అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. రేపటి నుంచి ‘చేయూత’ వెబ్ పోర్టల్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని సమాచారం. అర్హులు ఈ పోర్టల్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. 2 వారాల పాటు దరఖాస్తుల స్వీకరించనున్నారు. మరో రెండు వారాలు దరఖాస్తుల పరిశీలన ఉంటుంది. పది రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిశీలించి ఆమోదించనున్నారు.
