వైరల్ న్యూస్
పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా విడాకులు.. 13ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి!
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, ఆయన భార్య అన్నా లెజినోవా తమ 13 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు అనూహ్య ప్రకటన చేశారు. పరస్పర అవగాహన, గౌరవంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సోమవారం అర్ధరాత్రి జనసేన అధికారిక మీడియా గ్రూప్ ద్వారా ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు. ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
