సినిమా
Pawala shyamala: ప్రముఖ నటి పావలా శ్యామల కన్నుమూత
తెలుగు చిత్రసీమలో తనదైన నటనతో అలరించిన ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల మంగళవారం తెల్లవారుజామున 1:52 గంటలకు తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు అధికారికంగా వెల్లడించారు.
