క్రీడలు

వికెట్ల వెనుక పంత్ అల్లరి.. రహానె ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ వికెట్ల వెనుక చేసే సందడి, చమత్కార సంభాషణల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతీ బంతికీ ఏదో ఒక వ్యాఖ్య చేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను ఒత్తిడికి గురిచేయడం, బౌలర్లలో ఉత్సాహం నింపడం పంత్‌కు అలవాటు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లోనూ పంత్ తన మార్క్ డైలాగులతో విపరీతంగా అల్లరి చేశాడు. అయితే, పంత్ వ్యవహారంపై భారత మాజీ క్రికెటర్ అజింక్య రహానె ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.