వైరల్ న్యూస్
ఆ ఆలోచన లేదు: పొలిటికల్ ఎంట్రీపై హీరో సూర్య కీలక వ్యాఖ్యలు !
తమిళ సినీ రంగంలో అగ్ర కథానాయకుడిగా వెలుగొందుతోన్న హీరో సూర్య (Suriya) తన రాజకీయ ప్రవేశంపై (Political Entry) జరుగుతోన్న విస్తృత ప్రచారానికి చెక్ పెడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాజకీయాల్లో ప్రముఖ నటుడు విజయ్ సొంత పార్టీ స్థాపించి క్రియాశీలకంగా ముందడుగు వేసిన నేపథ్యంలో, సూర్య కూడా విజయ్ బాటలోనే రాజకీయాల్లోకి వస్తారా అనే ఆసక్తికర చర్చ కోలీవుడ్‌తో పాటు తెలుగు చిత్రసీమలోనూ జోరందుకుంది. ఈ క్రమంలో తన పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన సూర్య.. ప్రస్తుతానికి తనకు రాజకీయాల్లోకి ప్రవేశించే ఆలోచన ఏమాత్రం లేదని స్పష్టంగా ప్రకటించారు.
