ఏపీ
Nara Lokesh: తరగతి గది నుంచే సమాజంలో నిజమైన మార్పు: నారా లోకేశ్
పాఠశాల గదుల నుంచే సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు సాధ్యమవుతాయని, అందుకే తాను విద్యాశాఖను బాధ్యతాయుతంగా ఎంచుకున్నానని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. అధునాతన సాంకేతికతకు భారతీయ సంప్రదాయ నైతిక విలువలను జోడించడం ద్వారా విద్యార్థులు అంతర్జాతీయ వేదికలపై జగజ్జేతలుగా ఎదగవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంస్కరణలకు చాగంటి లాంటి మహనీయుల ఆదర్శాలు తోడైతే రాష్ట్ర విద్యావ్యవస్థ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
