ఏపీ

Nagababu: ‘మెగా’ బ్రదర్, ఎమ్మెల్సీ నాగబాబుకు మరో కీలక పదవి!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో ముఖ్య పరిణామం చోటుచేసుకుంది. జనసేన ముఖ్య నాయకుడు, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కలిగిన బాధ్యతలను కేటాయించింది. రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ పరిధిలోకి వచ్చే 'గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ' ఛైర్మన్‌గా ఆయనను నియమిస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ నియామకంతో పాటు ఆయనకు నేరుగా క్యాబినెట్ ర్యాంక్ హోదాను కల్పించడం గమనార్హం.