రాజకీయాలు
రేవంత్ పాలనలో పెరిగిన హత్యలు, ఆత్మహత్యలు, దోపిడీలు : కవిత
రేవంత్ రెడ్డి వెయ్యి రోజుల పాలనపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తాజాగా స్పందించారు. బుధవారం సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఆమె ఆసక్తికర పోస్టు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల పాలన ప్రజా వ్యతిరేక విధానాలతోనే సాగిందని, ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయిందని కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ రెండున్నరేండ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కరి పొట్ట నింపింది గానీ, పేదల బతుకులను బాగు చేసింది గానీ లేదన్నారు. హైడ్రా (HYDRA) పేరిట పేదల ఇండ్లను కూల్చారని, సంక్షేమ గురుకులాల్లో విద్యార్థుల వరుస మరణాలు, నోటిఫికేషన్లు రాక నిరుద్యోగ యువత ఆత్మహత్యలు, అన్నదాతల బలవన్మరణాలు, రోజురోజుకూ పెరిగిపోతున్న హత్యలు, నేరాలే రేవంత్ రెడ్డి సర్కార్ సాధించిన అసలైన ప్రగతి అని తీవ్ర విమర్శలు గుప్పించారు.
