క్రీడలు
టెస్ట్ క్రికెట్‌కు మహమ్మద్ షమీ వీడ్కోలు: 13 ఏళ్ల ప్రస్థానానికి భావోద్వేగ ముగింపు!
భారత సీనియర్ స్టార్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ సుదీర్ఘ ఫార్మాట్ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రెడ్ బాల్ క్రికెట్ లోకి అడుగుపెట్టి సరిగ్గా 13ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన ఈ నిర్ణయాన్ని వెల్లడించాడు. 2013 నవంబర్ 6న కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన షమీ, సరిగ్గా అదే రోజున వీడ్కోలు పలకడం విశేషం. అయితే పరిమిత ఓవర్ల ఫార్మాట్లు అయిన వన్డేలు, టీ20లతో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో దేశం కోసం ఆటను కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశాడు.
