National
Modi Trump Talks: ట్రంప్‌తో ప్రధాని మోడీ ఫోన్ కాల్.. ఏం మాట్లాడారో తెలుసా?
Modi Trump Talks: భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య కీలక ఫోన్ కాల్ సంభాషణ జరిగింది. ఇరు దేశాల మధ్య ఫ్రెండ్‌షిప్‌ను మరింత బలోపేతం చేసుకునే దిశగా సాగిన ఈ చర్చలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ టెలిఫోనిక్ మంతనాల వివరాలను స్వయంగా ప్రధాని మోడీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.భారత్ - అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాల ప్రగతిపై ఇద్దరు నేతలు లోతుగా సమీక్షించారు. ముఖ్యంగా వ్యాపార వాణిజ్యాలు, రక్షణ రంగ సహకారం, ఇంధన భద్రతతో పాటు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పరస్పరం పంచుకోవడంపై కీలక సమాలోచనలు జరిపారు. అంతర్జాతీయ స్థాయిలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు ఇరు దేశాలు భుజం భుజం కలిపి పనిచేయాలని సంయుక్తంగా నిర్ణయించుకున్నాయి.
