తెలంగాణ
పనితీరులో మార్పు రాకపోతే కఠిన చర్యలు- రెవెన్యూ ఉద్యోగులకు మంత్రి వార్నింగ్
Land Survey: రెవెన్యూ ఉద్యోగులు సక్రమంగా, బాధ్యతాయుతంగా పని చేసినప్పుడే ప్రజలు ముఖ్యంగా రైతుల సమస్యలు తీరుతాయని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఈ విషయంలో ఇప్పటికే పలుమార్లు రెవెన్యూ ఉద్యోగులను ఆదేశించినప్పటికీ పూర్తి స్థాయి ఫలితాలు కనిపించలేదన్నారు. భవిష్యత్తులో మార్పు రాకపోతే అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
