తెలంగాణ
ఏరోజు ఎక్కడా అవినీతికి పాల్పడలేదు, ఇంచు భూమి కబ్జా చేయలేదు
25ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్నానని, ఏ రోజు ఎక్కడా అవినీతికి పాల్పడలేదని, ఇంచు భూమి కూడా కబ్జా చేయలేదని, ఏ పనికీ ఒక్క పైసా తీసుకోలేదని మంత్రి జూపల్లి అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి నిబద్ధతతో పని చేస్తున్నానని, అందుకే ప్రజలు సుదీర్ఘకాలంగా తనను ఆశీర్వదిస్తున్నారని చెప్పారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా మరింత బాధ్యతగా పని చేస్తానని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని, క్షేత్ర స్థాయిలోనే పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే తన పర్యటనల ఉద్దేశమని వెల్లడించారు.
