తెలంగాణ
కొండా సురేఖకు మీనాక్షి నటరాజన్ ఫోన్ కాల్.. పార్టీ వ్యవహారాలపై సుదీర్ఘ చర్చ!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సంచలనం రేపిన పరిణామాల మధ్య మాజీ మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్ చేసి సుదీర్ఘంగా మాట్లాడారు. ఇటీవల మాజీ ఓఎస్డీ సుమంత్ కుటుంబానికి సంబంధించిన వివాదాలు, తదనంతరం చోటుచేసుకున్న పరిణామాలు, వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు సురేఖ హాజరు కాకపోవడం వంటి కీలక అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. ఈ క్లిష్ట సమయంలో వ్యక్తిగత విషయాలను పక్కనబెట్టి, పార్టీ వ్యవహారాల్లో తిరిగి చురుగ్గా పాల్గొనాలని మీనాక్షి నటరాజన్ ఆమెకు హితవు పలికారు.
