టాప్ న్యూస్
Medical Wonder: ఇక ఆపరేషన్ కుట్లకు గుడ్ బై.. వైద్య రంగంలో అద్భుత ఆవిష్కరణ!
శస్త్రచికిత్సలు అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆపరేషన్ గాయాలు, వాటికి వేసే కుట్లు, ఆ తర్వాత అయ్యే మచ్చలు. అయితే ఇకపై అలాంటి ఇబ్బందులు లేకుండా గాయాలను అత్యంత సులభంగా మాన్పించేందుకు హైదరాబాద్కు చెందిన సీఎస్ఐఆర్ - ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT) శాస్త్రవేత్తలు ఒక సంచలనాత్మక ఆవిష్కరణ చేశారు. శస్త్రచికిత్సలు, అనుకోకుండా జరిగే ప్రమాదాల వేళ కుట్లకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడేలా ఒక వినూత్న స్వదేశీ సర్జికల్ గ్లూను (టిష్యూ అడెసివ్) వారు విజయవంతంగా అభివృద్ధి చేశారు.
