International

బద్ధలైన మయోన్ అగ్నిపర్వతం.. 3 కిలోమీటర్ల ఎత్తుకు బూడిద మేఘాలు!

 పసిఫిక్ 'రింగ్ ఆఫ్ ఫైర్' (Ring of Fire) ప్రాంతంలో ఉన్న ఫిలిప్పీన్స్‌ దేశంలో ఒకేసారి తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆ దేశంలోనే అత్యంత ప్రమాదకరమైన మయోన్ అగ్నిపర్వతం (Mount Mayon) ఒక్కసారిగా విస్ఫోటనం చెందింది. సుమారు ఆరు నిమిషాల పాటు భీకర శబ్దాలతో సాగిన ఈ పేలుడు కారణంగా అగ్నిపర్వతం నుంచి వెలువడిన నల్లటి పొగ, రాళ్లు, దట్టమైన బూడిద మేఘాలు ఆకాశంలోకి ఏకంగా 3 కిలోమీటర్ల (దాదాపు 10 వేల అడుగులు) ఎత్తుకు ఎగసిపడ్డాయి. గాలుల తీవ్రత వల్ల ఈ బూడిద మేఘాలు నైరుతి దిశగా వేగంగా పయనిస్తూ సమీపంలో ఉన్న జనావాసాలను కప్పేస్తున్నాయి.