అరేబియాలో భారీ ఆపరేషన్.. రూ.3 వేల కోట్ల డ్రగ్స్ స్వాధీనం
ఇండియాలోకి సముద్ర మార్గం గుండా డ్రగ్స్ తీసుకురావడానికి ప్రయత్నించిన దుండగులను కోస్ట్ గార్డు బలగాలు పట్టుకున్నాయి.దేశానికి పెద్ద ఎత్తున తీర ప్రాంతం ఉంది.అయితే, భారత్ మీద నిలువెల్లా విషం కక్కే పాకిస్తాన్.. సముద్ర జలాల గుండా, సరిహద్దు బోర్డర్స్ నుంచి మత్తుపదార్థాలను దేశంలోకి పంపుతోంది. ఇక బంగ్లాదేశ్ నుంచి కూడా పెద్దఎత్తున దేశంలోకి మత్తు పదార్థాలు వస్తున్నాయి.మనదేశంలోనే కొందరు వ్యాపారులు, నేతలు కాసులకు కక్కుర్తి పడి వాటిని దేశంలోనికి అనుమతించడంతో యువత మత్తుకు బానిసవుతోంది. ఫలితంగా నేరాలు, దారుణాలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అరేబియా సముద్రంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ భారీ ఆపరేషన్ చేపట్టి భారీగా మాదకద్రవ్యాలను పట్టుకుంది. వీటిని తరలిస్తున్న ముఠాను సైతం అదుపులోకి తీసుకుంది. లక్షద్వీప్ దీవులకు సమీపంలోని సముద్ర జలాల్లో అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.3 వేల కోట్లు పలికే భారీ డ్రగ్స్ కన్సైన్మెంట్ను అధికారులు విజయవంతంగా పట్టుకున్నారు.
