వైరల్ న్యూస్

ఆకలితో కస్టమర్లు మిగిల్చిన ఫుడ్ తిన్నందుకు.. ఉద్యోగానికే ఎసరు!

 ఆకలి తీర్చుకోవడానికి ఓ పేద యువతి చేసిన చిన్న పని ఆమె ఉద్యోగాన్నే ఊడదీసింది. ఓ ప్రముఖ రెస్టారెంట్‌లో కస్టమర్లు తినగా మిగిలిపోయిన ఆహారాన్ని (Leftover Food) ప్యాక్ చేసుకుని ఇంటికి తీసుకెళ్లినందుకు 18 ఏళ్ల విద్యార్థినిని యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది. ఆకలి తీర్చుకునేందుకే తాను అలా చేశానని, సరైన భోజనం కొనుక్కునే స్థోమత లేకపోవడం వల్ల మిగిలిన ఆహారాన్ని తీసుకెళ్లానని సదరు యువతి ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.