తెలంగాణ
దొరికినంత దోచుడే.. మంత్రులు, ఎమ్మెల్యేల పీఏల వసూళ్లు..!
కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్నటివరకు మంత్రులు, ఎమ్మెల్యేల మీద అవినీతి ఆరోపణలు రాగా తాజాగా వారి పీఏ(పర్సనల్ అసిస్టెంట్స్) మీద కూడా అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ మధ్య ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మంత్రి పీఏ ఏకంగా రూ.కోట్ల స్కాం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల పీఏలు దొరికిన కాడికి దోచుడే అనే కాన్సెప్ట్‌తో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. ప్రజలు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు ఎవరికైనా మంత్రి, ఎమ్మెల్యేలతో పని ఉంటే అపాయింట్ మెంట్ ఇప్పించడం దగ్గరి నుంచి వారి పని పూర్తి చేసిపెట్టడానికి ఓ రేటు ఫిక్స్ చేసినట్టు సమాచారం.
