క్రైమ్

చెప్పుల విషయంలో గొడవ ఎంత పని చేసింది!

చెప్పుల విషయంలో జరిగిన గొడవ కారణంగా ఓ ఇంటి పెద్ద ఆత్మహత్యకు పాల్పడ్డాడు.భార్యభర్తల మధ్య గొడవ పెద్దది కావడంతో క్షణికావేశంలో తుపాకీతో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నట్టు సమాచారం. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లోని నిరాలినగర్‌లో గల బ్లాసమ్ అపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. సందీప్ సింగ్(47) ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో జనరల్ సర్జన్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంట్లో బాత్రూమ్ స్లిప్పర్స్ వేసుకొని గదిలోకి రావడంతో భర్తను.. భార్య కంచన్ నిలదీసింది. బెడ్రూంలోకి బాత్రూం స్లిప్పర్స్ ఎలా వేసుకొచ్చాడని నిలదీయడంతో ఇద్దరి మధ్య గొడవ పెరిగి పెద్దగా అయ్యింది. ఈ గొడవ ముదరడం.. భార్య అవమానకరంగా మాట్లాడిందని సందీప్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. దాంతో లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో ఛాతిపై కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.