ఏపీ

లోకల్ బాడీ ఎలక్షన్స్.. పెండింగ్ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పెండింగ్‌లో ఉన్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) నగారా మోగించింది. ఆంధ్రప్రదేశ్‌లోని 4 నగరపాలక సంస్థలు, 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్‌ను ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా గురువారం అధికారికంగా విడుదల చేశారు. పెండింగ్ లో ఉన్న స్థానిక ఎన్నికలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో సంబంధిత పురపాలక సంఘాల పరిధిలో వెంటనే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిందని అధికారులు పేర్కొన్నారుజ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రకటించిన షెడ్యూల్ మేరకు.. ఈ నెల 14 నుంచి 16 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. ఆ తర్వాత 26న పోలింగ్ నిర్వహించనున్నారు. చివరగా ఈ నెల 30న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. అనంతరం ఎన్నికల్లో గెలిచిన విజేతలను అధికారికంగా ప్రకటించనున్నట్టు ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు.