తెలంగాణ

అందరం కలిసి కోవిడ్‌ను ఎదుర్కొన్నట్లే ఎల్‌నినోను ఎదుర్కొందాం

Elnino: ప్రపంచాన్ని వణికిస్తున్న అతిపెద్ద విపత్తు ఎల్‌నినో అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కోవిడ్ వల్ల గతంలో ప్రపంచమే స్తంభించిపోయిందని గుర్తు చేసిన ఆయన.. అలాంటి సంక్షోభమే ఎల్‌నినో అని చెప్పారు. భూమిపై ఉన్న ప్రతి జీవరాశిపై ఎల్‌నినో ప్రభావం ఉండబోతుందన్నారు. ఎల్ నినో అంశంపై మంత్రులతో సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్. ప్రపంచాన్ని వణికిస్తున్న అతిపెద్ద విపత్తు ఎల్‌నినో అని ఆయన.. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అందుబాటులో ఉన్న సహచర మంత్రివర్గ సభ్యులతో ఎల్‌నినో ప్రభావంపై చర్చించినట్లు రేవంత్ తెలిపారు.