వైరల్ న్యూస్
కార్పొరేట్ కొలువు వదిలి ఆటో స్టీరింగ్ పట్టి.. బెంగళూరు మహిళ స్ఫూర్తిదాయక కథ వైరల్!
సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని, నైట్ షిఫ్ట్ ఒత్తిళ్లను వదిలేసి ఓ మహిళ రాపిడో ఆటో డ్రైవర్గా మారిన వినూత్న ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగుచూసింది. సొంత కుటుంబానికి, ముఖ్యంగా ఒంటరిగా ఉన్న తల్లికి సమయం కేటాయించడం కోసం ఆమె తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తీవ్రంగా వైరల్ అవుతోంది. సాంకేతిక రంగాన్ని వీడి ఆటో డ్రైవర్గా మారిన ఆమె ధైర్యాన్ని, జీవితాశయాన్ని నెటిజన్లు విశేషంగా ప్రశంసిస్తున్నారు.
