అభిప్రాయం
Land Issues: 22-ఏ భూ బాధితుల సమావేశం.. భూ సమస్యలకు నిపుణులు సూచించిన పరిష్కారాలు
22-ఏ: హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ధరణి, భూ భారతి, 22ఏ సృష్టించిన సమస్యలపై.. చర్చిద్దాం, ప్రభుత్వాన్ని నిలదీద్దాం, పరిష్కార మార్గాలు చూపుదాం పేరుతో ప్రత్యేక సమావేశం జరిగింది. తెలంగాణ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో భూ నిపుణులు, రిటైర్డ్ ఆఫీసర్లు, 30 మంది వరకు భూ బాధితులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు చేస్తున్న తప్పులు ఏంటి? అసలు భూ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? భూ సమస్యలకు పరిష్కారాలు ఏంటి? అనేది నిపుణులు వివరించడంతో పాటు పరిష్కారాలు సైతం సూచించారు.
