తెలంగాణ

KTR: మోదీపై పోరాడుతుంటే రేవంత్ రెడ్డికి కోపమెందుకు? కేటీఆర్‌ ఫైర్

నీట్ (NEET) ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారానికి వ్యతిరేకంగా ఢిల్లీలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జ్, పోలీసుల దౌర్జన్యాల సెగ తెలంగాణకు పాకింది. ఢిల్లీ ఘోరకలికి నిరసనగా బీఆర్‌ఎస్ విద్యార్థి విభాగం (BRSV) ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన భారీ నిరసన ప్రదర్శనలో బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.