తెలంగాణ
Krishna Basin: కృష్ణా బేసిన్లో పెరుగుతున్న వరద ప్రవాహం..
Krishna Basin: కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కొద్ది రోజులుగా నిలిచిన ప్రవాహం ప్రస్తుతం ఆశాజనకంగా మారింది. సిడబ్ల్యూసి అంచనాల మేరకు హిప్పర్గికి 62వేల క్యూసెక్కులు, ఆల్మట్టికి 60వేల క్యూసెక్కులు, నారాయణపూర్ కు 58వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. ఎగువ ప్రాజెక్టులో పూర్తి స్థాయికి నీరు చేరడంతో నిల్వ సామర్థ్యం దాదాపు నిండింది.
