రాజకీయాలు
రాజీనామాకు కొండా సిద్దం!.. పార్టీని వీడుతారా?
మంత్రి కొండా సురేఖ అంశం మొత్తానికి కొలిక్కి వచ్చింది.ఇన్నిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్టు అయ్యింది. కొండా విషయంలో అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పలు కథనాలు వచ్చాయి. నిన్న ఢిల్లీలో జరిగిన పరిణామాలతో అవన్నీ కట్టుకథలే అని తేలిపోయింది.సురేఖకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ కావాలనే అపాయింట్మెంట్ ఇవ్వలేదని ప్రచారం జరుగుతుండగా.. ఖర్గే సైతం చేతులెత్తేసినట్టు తెలిసింది. దీంతో కొండా మంత్రి పదవి పోవడం ఖాయమని తేలిపోయింది. తాము తొలగించక ముందే మంత్రి పదవి నుంచి పక్కకు తప్పుకోవాలని సురేఖకు పార్టీ అధిష్టానం సూచించినట్టు సమాచారం.అయితే, మంత్రి పదవితో పాటు పార్టీని కూడా వీడాలా? అనే ఆలోచనలో సురేఖ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. లేదా మంత్రి పదవికి రాజీనామా చేసి ఎమ్మెల్యేగా కొనసాగాలా? అనే ఆలోచన సైతం చేస్తున్నట్టు సమాచారం.
