వ్యాపారం

KitchenBudget: వంటింట్లో ధరల మంట.. ఒక్క నెలలోనే పైపైకి!

 మార్కెట్‌లో నిత్యావసరాల ధరల పెరుగుదల సామాన్య కుటుంబాలపై అదనపు భారాన్ని మోపుతోంది. తాజాగా అందుబాటులో ఉన్న ధరల పట్టికను పరిశీలిస్తే.. సెప్టెంబర్‌తో పోలిస్తే అక్టోబర్‌లో పప్పులు, మిరపకాయలు, చక్కెర, డ్రైఫ్రూట్స్‌ తదితర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగాయి. నెల వ్యవధిలోనే పలు కీలక వస్తువుల ధరలు పైకి కదలడం ఆందోళన కలిగిస్తోంది. ఈనేపథ్యంలో ధరల నియంత్రణపై ప్రభుత్వ చర్యలు అవసరమన్న చర్చ కొనసాగుతోంది.  సెప్టెంబర్‌లో కిలో కందిపప్పు ధర రూ.126 ఉండగా.. అక్టోబర్‌లో రూ.143కు చేరింది. అంటే కిలోకు రూ.17, సుమారు 13.5శాతం పెరుగుదల నమోదైంది.