National
Kiren Rijiju: చైనా చొరబాట్లపై అసత్య ప్రచారాలు వద్దు.. సరిహద్దు భద్రతపై కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు!
దేశ సరిహద్దుల భద్రత, మౌలిక వసతుల కల్పనకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని మాజా, గలేమో, తక్సింగ్ వంటి క్లిష్టమైన సరిహద్దు ప్రాంతాల్లో ఆయన స్వయంగా పర్యటించి రహదారులు, ఇతర అభివృద్ధి పనులను సమీక్షించారు. అరుణాచల్‌లో సరిహద్దు సమస్య దశాబ్దాలుగా ఉందని, ఇరు దేశాల మధ్య సరిహద్దుపై స్పష్టమైన గుర్తింపు, స్తంభాలు లేకపోవడం వల్లే కొన్ని చిక్కులు వస్తున్నాయని వివరించారు.
