తెలంగాణ
Khairatabad by-election: ఖైరతాబాద్‌లో హస్తం హ్యాట్రిక్ కొడుతుందా?..
తెలంగాణ రాజకీయాల్లో ఖైరతాబాద్ ఉపఎన్నిక హాట్ టాపిక్ లా మారింది. దానం నాగేందర్ అనర్హతపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థిస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయడంతో ఖైరతాబాద్ సీటు ఖాళీ అయింది. దీంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ పరిణామంతో రాష్ట్రంలో మూడో ఉపఎన్నికకు తెరలేవడమే కాకుండా, అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు ఇది జీవన్మరణ సమస్యగా మారింది.
గతంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఆ తర్వాత జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇప్పుడు ఖైరతాబాద్‌లోనూ అదే ఫలితాన్ని సాధిస్తే వరుసగా మూడో ఉపఎన్నికలో గెలిచి హ్యాట్రిక్ కొడుతుంది.
