తెలంగాణ

‘కేసీఆర్ చావాలి’.. ఆ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే శంకర్ వివరణ!

ఎర్రవెల్లికి వెళ్లే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ‘కేసీఆర్ చనిపోవాలి.. ఆయన చావును మేం కోరుకుంటున్నాం’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదిలాఉండగా, మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తాజాగా వివరణ ఇచ్చారు. ఆవేశంలో అలా మాట్లాడాల్సి వచ్చిందని ఎమ్మెల్యే శంకర్ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.‘ఒకరి చావును కోరడం ఏ మాత్రం సమర్థనీయం కాదు. కేటీఆర్ గతంలో “ఎక్కడ సచ్చిండు రాహుల్ గాంధీ” అంటూ చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్‌ను చూడండి. సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్‌, మహిళా మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే కడుపుమండి కేసీఆర్ వెంటనే అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై చర్చించాలని కోరా.. తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలదని.. కేసీఆర్ కుటుంబానిది మాత్రమే కాదు. సీఎం, తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తులపై వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదు’ అంటూ క్లారిటీ ఇచ్చారు.