KCR Farmhouse: కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములపై విచారణ ప్రారంభం
KCR Farmhouse: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్ భూములపై విచారణ ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ పరిసరాల్లో ప్రభుత్వ భూముల వివరాలను రెవెన్యూ అధికారులు సేకరిస్తున్నారు. ఫామ్‌హౌస్‌కు సమీపంలో ఉన్న ప్రభుత్వ భూముల సర్వే నెంబర్లు, గతంలో ఆ భూములను సాగు చేసిన రైతుల పేర్లను ఆరా తీస్తున్నారు. ఆర్డీవో చంద్రకళ మర్కూక్ తహశీల్దార్ ఆఫీసులో రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తున్నారు.
