తెలంగాణ
కేసీఆర్ వినిపించుకోలేదు.. రేవంత్ అయినా నా మాట వినాలి : రాజాసింగ్
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.నేటితో సెషన్‌కు చివరి రోజు కావడంతో సభ్యులు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వ తరపున మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు.ఈ క్రమంలోనే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలకవ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు విలువ ఉందో లేదో అర్థం కావడం లేదన్నారు. ఎమ్మెల్యేలు చేసిన సూచనలు, ప్రజాసమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. గతంలో కేసీఆర్‌కు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాలనే కల ఉండేదని.. నగర పరిధిలోని ఎమ్మెల్యేలతో కలిసి కో-ఆర్డినేషన్ భేటీ ఏర్పాటు చేయాలని గతంలో తాను ఇచ్చిన సలహాను మాజీ సీఎం పట్టించుకోలేదన్నారు. కనీసం ఇప్పుడైనా సీఎం రేవంత్.. సిటీ అభివృద్ధి కోసం హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్ చేశారు.
