National

Kaveri Issue: కావేరీ జలాల వివాదం.. సుప్రీంకోర్టులో కర్ణాటకకు ఎదురుదెబ్బ!

కావేరీ నదీ జలాల పంపకాల వివాదంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడు రాష్ట్రానికి కావేరీ నీటిని వెంటనే విడుదల చేయాలంటూ కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (CWMA) ఇచ్చిన ఉత్తర్వులను కచ్చితంగా పాటించాల్సిందేనని కర్ణాటక ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అథారిటీ జారీ చేసిన ఆదేశాలను విస్మరించడం సరికాదని వ్యాఖ్యానించడంతో, ఈ సుదీర్ఘ వివాదంలో తమిళనాడు రాష్ట్రానికి ఊరట లభించినట్లయింది.