Spirituality

కార్తీక మాసోత్సవాలు.. భక్తులతో కిటకిటలాడుతున్న శ్రీశైలక్షేత్రం!

 శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దివ్యక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో పరమ పవిత్రమైన కార్తీక మాసోత్సవాలు మంగళవారం నుంచి అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు స్వామి, అమ్మవార్ల దర్శనార్థం శ్రీశైలానికి తరలివస్తున్నారు. ఈ పవిత్ర ఉత్సవాలు డిసెంబర్ 9 వరకు నెల రోజుల పాటు నిరంతరం కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో క్షేత్రానికి విచ్చేసే భక్తజన సందోహానికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా శ్రీశైల జగద్గురు పీఠం, దేవస్థానం అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు పూర్తి చేశారు.