National

Karnataka politics: కన్నడ నాట కుర్చీలాట.. డీకే శివకుమార్ ఓపెన్ ఛాలెంజ్!

Karnataka politics: కర్ణాటక రాజకీయ యవనికపై అధికారం కోసం సాగుతున్న కుర్చీలాట ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలాగైనా కూల్చాలన్న పట్టుదలతో విపక్షాలు పావులు కదుపుతున్నాయన్న ప్రచారానికి ఆజ్యం పోస్తూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర పేల్చిన ఒక పొలిటికల్ బాంబ్ కన్నడ నాట తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం పూర్తిగా తమకు అనుకూలంగా మారిందని, ఎన్నికలు వస్తే కాంగ్రెస్ క్యాబినెట్ మంత్రులతో సహా ఏకంగా 25 మంది ఎమ్మెల్యేలు కమలం గూటికి చేరడం ఖాయమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపాయి. తమకు ఎవరినీ బలవంతంగా లాక్కోవాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ తీరుపై విసిగిపోయిన అసంతృప్త నేతలే స్వయంగా బయటకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని విజయేంద్ర తేల్చిచెప్పారు.