తెలంగాణ
JuralaProject: కర్ణాటక నీళ్లేవి? రైతులను మభ్యపెడుతున్న రేవంత్‌రెడ్డి!
జూరాల ప్రాజెక్టుకు కర్ణాటక నుంచి నీటిని విడుదల చేయించడంలో తెలంగాణ ప్రభుత్వం ప్రచారానికే పరిమితమైందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ మంత్రుల బృందం కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో భేటీ అయి నీటి విడుదలకు ఒప్పించామని, జూరాలకు జలకళ తీసుకువచ్చామని హడావుడి చేశారు. అయితే, అక్కడ కర్ణాటక స్థానిక నేతలు, రైతు సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవడంతో ఆ ప్రభుత్వం నీటి విడుదలను నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఫలితంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు తీవ్ర పంట కష్టాలు ఎదురవుతున్నాయి.
