తెలంగాణ

‘పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్లు అయింది’ కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్!

 తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం పిచ్చోడి చేతికి రాయి ఇచ్చినట్లుగా తెలంగాణ రాష్ట్రం పరిస్థితి మారిందని, ఏ ఒక్క వర్గానికి కూడా కాంగ్రెస్ పాలనలో న్యాయం జరగడం లేదని ఆయన తీవ్రంగా ఆరోపించారు. గోదావరి నదిలో పుష్కలంగా నీళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ, ఉద్దేశపూర్వకంగానే పంపుహౌస్‌ల ద్వారా నీటిని ఎత్తిపోయకుండా ప్రభుత్వం రాష్ట్రంలో 'కృత్రిమ కరవు'ను సృష్టిస్తోందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ సాగునీటి విధానాలను తప్పుబడుతూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.