International

ఇది చేతిరాతా? డిజిటల్ ప్రింటా?: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న నేపాల్ అమ్మాయి!

మానవ మేధస్సు, క్రమశిక్షణతో కూడిన నిరంతర సాధన ఏ స్థాయిలో అద్భుతాలను సృష్టించగలదో నిరూపిస్తోంది నేపాల్‌కు చెందిన ఓ సాధారణ విద్యార్థిని. ఆమె పేరు ప్రకృతి మల్లా (Prakriti Malla). ఆమె చేతిరాతతో రాసిన అక్షరాలను చూస్తే ఎవరైనా సరే.. అది నిజంగా చేతితో రాసిందా లేక కంప్యూటర్ ఫాంట్ సహాయంతో ప్రింట్ తీశారా అని ఆశ్చర్యపోవాల్సిందే. అచ్చం డిజిటల్ ప్రింట్‌ను తలపించేలా, ఏమాత్రం సైజు తేడా లేకుండా ఉన్న ఆమె అక్షరాలు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి విపరీతమైన ప్రశంసలు అందుకుంటున్నాయి.