సినిమా

Irumudi Director: ముగ్గురు హీరోలు లైన్‌లో ఉన్నారా?

Shiva Nirvana: ఇప్పుడు ముగ్గురు హీరోలు శివ నిర్వాణతో సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నారట. వారిలో అక్కినేని నాగ చైతన్య ముందు ఉన్నాడని తెలుస్తోంది. గతంలో చైతూ-శివ నిర్వాణ కలిసి మజిలీ సినిమాను చేసి భారీ హిట్ అందుకున్నారు. ఇందులో సమంత హీరోయిన్‌గా నటించడం విశేషం. ఇక, కోలీవుడ్ నుంచి సూర్య, ధనుష్ కూడా ఇరుముడి సినిమా చూసి ఈ దర్శకుడిపై ప్రశంసల వర్షం కురుపించడమే కాదు, కథ ఉంటే రమ్మని కూడా ఆఫర్ చేశారట. ధనుష్, సూర్య ఇద్దరు తెలుగులో స్ట్రైట్ సినిమాలు చేసి హిట్ కొట్టినవారే.