International
ఇరాన్ పైలట్లు మా కస్టడీలో లేరు.. ఖతార్ రక్షణ శాఖ క్లారిటీ
ఈ ఏడాది మార్చిలో గల్ఫ్ జలాల్లో జరిగిన ఇరాన్ సైనిక విమాన ప్రమాద ఘటనపై ఖతార్ ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. ఇరాన్‌కు చెందిన ముగ్గురు ఫైటర్ పైలట్లు తమ కస్టడీలోనే ఉన్నారంటూ అంతర్జాతీయ మీడియాతో పాటు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఈ ప్రమాద ఘటనలో కేవలం ఒకే ఒక పైలట్ మృతదేహం మాత్రమే సముద్రంలో లభించిందని, దానిని దౌత్య నిబంధనల ప్రకారం ఇరాన్ అధికారులకు అప్పగించామని స్పష్టం చేసింది. విమాన ప్రమాదం జరిగిన వెంటనే గల్ఫ్ జలాల్లో పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టినట్లు ఖతార్ ప్రకటించింది.
