International

Iran Response: హర్మూజ్ తమదని ట్రంప్ సంచలన పోస్ట్.. తీవ్రంగా ఖండించిన ఇరాన్!

అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన సముద్ర మార్గమైన హర్మూజ్ జలసంధిని ‘అమెరికా నూతన భూభాగం’ (NEW U.S. Territory) అని అభివర్ణిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా ఖాతాలో ఓ మ్యాప్‌ను పోస్ట్ చేయడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఇరాన్‌తో కుదిరిన 60రోజుల అవగాహన ఒప్పందం గడువు ముగిసిన మరుసటి రోజే ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది. జలసంధిలో సముద్ర గర్భంలో అమర్చిన మైన్‌లన్నింటినీ తొలగించామని లేదా నిర్వీర్యం చేశామని, నౌకా రవాణా కార్యకలాపాలను యథావిధిగా పునరుద్ధరించామని ట్రంప్ తన సందేశంలో పేర్కొన్నారు.