దునియా

iPhones: రూ. 3 లక్షలైనా ఎగబడి కొంటున్నారు.. ఐఫోన్‌లకు ప్రపంచవ్యాప్తంగా ఎందుకంత క్రేజ్?

iPhones: ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఎన్ని బ్రాండ్లు వచ్చినా, ఎన్ని అత్యాధునిక ఫీచర్లను పరిచయం చేసినా 'ఆపిల్' సృష్టించే హవా ముందు అవన్నీ దిగదుడుపే అవుతున్నాయి. తాజాగా విడుదలైన 'ఐఫోన్ 18' సిరీస్‌లో తొలి ఫోల్డబుల్ ఫోన్ టాప్ వేరియంట్ ధర అక్షరాలా రూ. 3.29 లక్షలు దాటింది. కనీస వేరియంట్ ధరలే రూ. 1.64 లక్షల నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సామాన్యులకే కాదు, మధ్యతరగతికి సైతం మైండ్ బ్లాంక్ అయ్యే ఈ స్థాయి ధరలు ఉన్నప్పటికీ.. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్‌లలోని ఆపిల్ స్టోర్ల ముందు జనాలు అర్ధరాత్రి నుంచే బారులు తీరి మరీ కొనుగోలు చేశారు. అసలు ఐఫోన్‌కు ఇంత పిచ్చి ఎందుకు? రూ. లక్షలు గుమ్మరించి మరీ కొనేలా చేసే ఆ మాయాజాలం ఏంటి?ప్రస్తుత సమాజంలో ఐఫోన్ అనేది కేవలం సమాచార మార్పిడి సాధనంగా మాత్రమే మిగల్లేదు. అదొక లగ్జరీ లైఫ్ స్టైల్‌కి, స్టేటస్ సింబల్‌గా మారిపోయింది. చేతిలో ఆపిల్ లోగోతో ఉన్న సరికొత్త ఫోన్ కనిపిస్తే సమాజంలో ప్రత్యేక గుర్తింపు దక్కుతుందనే అభిప్రాయం యూజర్లలో నాటుకుపోయింది. ప్రతీసారీ కొత్త సిరీస్ వచ్చినప్పుడు "అందరికంటే ముందుగా నేనే సొంతం చేసుకున్నా" అనే ఆత్మసంతృప్తి, స్పెషల్ ఫీలింగ్ కస్టమర్లను గంటల తరబడి క్యూలలో నిలబెడుతోంది.