వైరల్ న్యూస్

దీపావళికి ఇజ్రాయెల్ ఎంబసీ వినూత్న శుభాకాంక్షలు!

 పండుగల వేళ శుభాకాంక్షలు తెలపడంలో వివిధ దేశాల రాయబార కార్యాలయాలు విభిన్న పద్ధతులను అనుసరిస్తుంటాయి. ఈ క్రమంలో భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం (Israel Embassy in India) దీపావళి పండుగను పురస్కరించుకుని అత్యంత సృజనాత్మకమైన, సరదాగా సాగే ఒక వీడియోను రూపొందించి అందరినీ ఆకట్టుకుంది. ప్రసిద్ధ 'చైనీస్ విస్పర్' (Chinese Whisper) గేమ్ ఆధారంగా దౌత్యవేత్తలు సరదాగా ఆడిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ నెటిజన్లను కడుపుబ్బా నవ్విస్తోంది.