క్రీడలు
తగ్గిన భారత్ ఆధిక్యం.. సచిన్ రికార్డును సమం చేసిన విరాట్ కోహ్లీ!
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో ఎవరికీ తలవంచని రికార్డులను సృష్టించినప్పటికీ, తాజాగా ఒక చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన నాల్గో వన్డేలో బరిలోకి దిగిన కోహ్లీ నాలుగు బంతులు ఎదుర్కొన్నప్పటికీ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ డకౌట్ల సంఖ్య 20కి చేరగా, దీని ద్వారా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉన్న అవాంఛిత రికార్డును ఆయన సమం చేశారు.
