Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. నవంబర్ 1 నుంచి 60 రోజుల ముందే బుకింగ్‌కి ఛాన్స్!
Indian Railways: రైలు ప్రయాణం ప్లాన్ చేసుకునేవారికి రైల్వే శాఖ నుంచి అత్యంత కీలకమైన సమాచారం అందింది. ఇప్పటివరకు ఉన్న ముందస్తు రిజర్వేషన్ రూల్స్‌లో పెద్ద మార్పు చోటుచేసుకుంది. ప్రయాణ తేదీకి 120 రోజుల ముందే టికెట్లు బుక్ చేసుకునే పాత పద్ధతికి స్వస్తి పలుకుతూ, ఆ గడువును 60 రోజులకు కుదించారు. ఈ సరికొత్త నిబంధన నవంబర్ 1 నుంచే దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తోంది. గతంలో నాలుగు నెలల ముందే బుకింగ్స్ ఓపెన్ అవ్వడం వల్ల ప్రైవేట్ ఏజెంట్లు, దళారులు రద్దీ రూట్లలోని టికెట్లను గుత్తగా బ్లాక్ చేసేవారు. తీరా ప్రయాణ సమయానికి భారీగా క్యాన్సిలేషన్లు జరగడం, లేదా బ్లాక్‌లో టికెట్లను ఎక్కువ ధరకు అమ్ముకోవడం వంటి సమస్యలు వచ్చేవి. దీనివల్ల సాధారణ ప్రయాణికులకు సీట్లు దొరకడం కష్టంగా మారేది. వీటన్నింటికీ అడ్డుకట్ట వేసి, నిజమైన ప్రయాణికులకు కన్ఫర్మ్ బెర్తులు దక్కేలా చూడటానికే రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు.
