తెలంగాణ
జలమండలి కీలక ప్రకటన.. నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్!
బతుకమ్మ, దసరా పండుగల వేళ హైదరాబాద్ వాసులకు నిరంతర తాగునీటి సరఫరా అందించడంతో పాటు రహదారులపై సీవరేజ్ ఓవర్‌ఫ్లో సమస్యలు తలెత్తకుండా జలమండలి పటిష్టమైన చర్యలు చేపట్టింది. నగరంలో తాగునీటి వృథాను అరికట్టేందుకు, నవంబర్ 1 నుంచి నిర్మాణ రంగాలు, పార్కులు, ల్యాండ్‌స్కేపింగ్, పారిశ్రామిక అవసరాల కోసం 'గ్రీన్ వాటర్ ట్యాంకర్' (Green Water Tankers) సేవలను అధికారికంగా ప్రారంభించనున్నట్లు జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి వెల్లడించారు. పండుగల నేపథ్యంలో నిర్వహించిన ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో ఆయన ఈ కీలక మార్గదర్శకాలను జారీ చేశారు.
