వ్యాపారం
పశ్చిమాసియా ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల దిశగా దేశీయ స్టాక్ మార్కెట్లు!
అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న భౌగోళిక రాజకీయ అస్థిరత, తీవ్ర ఉద్రిక్తతల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా నష్టాల బాట పట్టాయి. సోమవారం ఉదయం స్వల్ప లాభాలతో ఉత్సాహంగా ట్రేడింగ్‌ను ప్రారంభించినప్పటికీ, మధ్యాహ్న సమయానికి అమ్మకాల ఒత్తిడి విపరీతంగా పెరగడంతో సూచీలు పతనం అయ్యాయి. ప్రధానంగా పశ్చిమాసియాలో ముదురుతున్న సంక్షోభం మదుపర్లలో భయాందోళనలను కలిగిస్తోంది.
