తెలంగాణ

జన్వాడలో అక్రమ వెంచర్‌పై చర్యలు సరే.. ఇప్పుడు అసలు ప్రశ్న ఇదే

Janwada Venture Demolish: ఎట్టకేలకు అధికారుల్లో చలనం వచ్చింది. రంగంలోకి దిగారు. కొరడా ఝళిపించారు. అక్రమ వెంచర్‌పై ఉక్కుపాదం మోపారు. హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం జన్వాడలో అక్రమ వెంచర్ పై అధికారులు జేసీబీలతో వచ్చి మరీ చర్యలు తీసుకున్నారు. అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు.

కాస్త ఆలస్యమైనా వారి చర్యను స్వాగతించాల్సిందే. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే. జీవోలకు, నిబంధనలకు విరుద్ధంగా ఏర్పడిన ఒక్క వెంచర్‌పైనే ఈ చర్యలా..? లేక జన్వాడలో ఉన్న అన్ని అక్రమ వెంచర్లపైనా ఇదే తరహా ఉక్కుపాదం మోపుతారా..? అనే ప్రశ్నకు సమాధానం రావాల్సి ఉంది.