సినిమా

తెలంగాణ వచ్చాకే నాకు అవకాశాల్లేవు.. యాంకర్ ఉదయభాను సంచలన వ్యాఖ్యలు!

ప్రముఖ యాంకర్, నటి ఉదయభాను టాలీవుడ్ పరిశ్రమలో తన ప్రస్తుత పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రముఖ మీడియా ఛానల్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతే తనకు ఇండస్ట్రీలో ఆఫర్లు తగ్గిపోయి, క్రమంగా అవకాశాలు లేకుండా పోయాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో తెలంగాణ నేపథ్యం ఉన్న కథలు, సినిమాలు ఎక్కువగా వస్తున్నప్పటికీ, కేవలం ఒకే ప్రాంతానికి చెందిన నేపథ్యం ఉన్నంత మాత్రాన ఎవరికీ అవకాశాలు ఊరికే వచ్చేయవని ఆమె స్పష్టం చేశారు.