International

నా భార్యకు నమ్మక ద్రోహం చేశా.. క్షమించండి: సీఈవో ఆవేదన

 ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చిప్‌ల తయారీ సంస్థ 'ఎన్విడియా' (NVIDIA) సహ-వ్యవస్థాపకుడు, సీఈఓ జెన్సన్ హువాంగ్ (Jensen Huang) తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి రాసిన ఒక భావోద్వేగ లేఖ అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. తాను 41 ఏళ్లుగా వివాహ బంధంలో ఉన్న భార్యకు నమ్మకద్రోహం చేశానని, వేరొక మహిళతో వివాహేతర సంబంధం కలిగి ఉన్నాననే విషయాన్ని ఆయన బహిరంగంగా అంగీకరించారు. ఈ మేరకు సంస్థలోని ఉద్యోగులకు, బోర్డు డైరెక్టర్లకు ఒక అంతర్గత ఇమెయిల్ పంపుతూ, తన తప్పులకు గాను కుటుంబానికి, భాగస్వాములకు తీవ్ర ఆవేదనతో క్షమాపణలు తెలియజేశారు.